ఏనుగు బీభత్సం : ఒకరు మృతి 

by srinivas |
ఏనుగు బీభత్సం : ఒకరు మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గ్రామమైన మల్లానూరు పంచాయతీలో ఏనుగు బీభత్సం సృష్టించింది. గ్రామ సమీపంలో వేరుశనగపంటకు రాత్రి వేళలో కాపలాగా ఉన్న తండ్రీకూతుర్లపై ఏనుగు దాడి చేసింది. రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సోనియాపై ఏనుగు దాడి చేసింది. తొండంతో సోనియాను విసిరి కొట్టడంతో… ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆమె తండ్రి మురుగన్ ఏనుగు దాడి నుండి తప్పించుకున్నాడు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. కాగా మరణించిన సోనియా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతోంది. సోనియా మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న చిత్తూరు డిఎఫ్ఓ శంకర్ ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను‌ ఓదార్చారు.

Advertisement

Next Story