బాలుర ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ.. వారికి వార్నింగ్

by Sridhar Babu |   ( Updated:2021-11-11 05:37:37.0  )
బాలుర ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ.. వారికి వార్నింగ్
X

దిశ, మణుగూరు: పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలోని గొండిగూడెం గ్రామంలో ఉన్న బాలుర ఆశ్రమ పాఠశాలలో భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రూ గౌతమ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గురువారం గొండిగూడెం గ్రామాన్ని సందర్శించి బాలుర ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదులు, లైబ్రరీ, వంటగది, డైనింగ్ హాల్, ఆటస్థలం, భోజన పదార్ధాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ… విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. టైం ప్రకారం విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, ఏటీడీఓ పునెం నర్సింహారావు, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి వీరస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోడిగ రామారావు, ఉపాధ్యాయులు గుగులోత్ వీరస్వామి, చీమల అచ్చయ్య, వార్డెన్ ఎం. తారసింగ్, ఎన్.సీ.సీ అధికారి బి.తారచంద్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed