- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏసీబీకి చిక్కిన అవినీతి సర్పంచ్
by Sumithra |

X
దిశ, పరిగి: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ గ్రామ సర్పంచ్ వినోద్ గౌడ్ ఏసీబీకి చిక్కారు. గ్రామ సమీపంలో ఐదెకరాల ఎకరాల స్థలంలో లే–అవుట్ చేసేందుకు మహబూబ్ ఆలంఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. దీని అనుమతికి సర్పంచ్ వినోద్ గౌడ్ రూ.20 లక్షలు డిమాండ్ చేయగా రూ.13 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. మహబూబ్ ఆలంఖాన్ ఈ విషయం ఏసీబీ అధికారులు చెప్పాడు. అప్పా జంక్షన్ వద్ద వినోద్ గౌడ్ కు ఆలంఖాన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మన్నెగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి మాణిక్యంను కూడా విచారించారు. వినోద్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story