- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ.13 కోట్లకు అమ్ముడుపోయిన రాపర్ షూస్
దిశ, సినిమా : అమెరికన్ రాపర్ కేన్ వెస్ట్ ధరించిన షూస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. 2008 గ్రామీ అవార్డు వేడుకల్లో ‘స్ట్రాంగర్, హే మామా’ పాటలకు పర్ఫామ్ చేసిన కేన్.. ఆ టైమ్‌లో ధరించిన నైకీ ఎయిర్ ఈజీ 1 ప్రొటోటైప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఆ షూస్‌ను స్నీకర్ ఇన్వెస్టింగ్ ప్లాట్‌ఫామ్ ‘రేర్స్’ వేలంలో దాదాపు రూ.13 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు స్నీకర్ సేల్‌లో ఇదే అత్యధిక రికార్డు కావడం విశేషం. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ వేలం సంస్థ ‘సోతెబీస్’లో మొదటిసారి 1 మిలియన్‌కు పైగా ధరకు అమ్ముడుపోయిన ఈజీ స్నీకర్స్‌గా కేన్ వెస్ట్ షూస్ రికార్డు సృష్టించాయి. తన ఈజీ లైన్ కలెక్షన్‌లో మొదటి పెయిర్ అయిన ఈ హై టాప్ బ్లాక్ షూస్.. కేన్ బిలియనీర్ అయ్యేందుకు సాయపడటంతో పాటు స్నీకర్, స్ట్రీట్‌వేర్ కల్చర్ పాపులర్ అవడంలోనూ కీ రోల్ పోషించాయి.
కాగా, జూన్ 16 నుంచి రేర్స్ సంస్థ.. తన వెబ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ స్నీకర్స్‌కు సంబంధించిన షేర్లను విక్రయించనుంది. ఈ మేరకు ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన షూస్’లో ఓనర్‌షిప్ పొందేందుకు యూజర్లకు వీలు కల్పిస్తోంది. ఇందుకోసం యూజర్లు ఒక స్పాట్‌ను బుక్ చేసుకుని, ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందని రేర్స్ పేర్కొంది. సేల్ ఓపెన్ కాగానే వారికి నోటిఫికేషన్ వస్తుందని తెలిపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించే బూట్ల షేర్లు, కంపెనీని బట్టి సాధారణంగా రూ.100 -150 మధ్య ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.