ఒక పక్క కుళ్లిపోయిన కొడుకు శవం.. మరో పక్క తల్లి ఎవరికి చెప్పకుండా

by Anukaran |   ( Updated:2021-09-08 23:28:30.0  )
ఒక పక్క కుళ్లిపోయిన కొడుకు శవం.. మరో పక్క తల్లి ఎవరికి చెప్పకుండా
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరులో విషాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డ నిద్రలోనే కన్నుమూస్తే ఆ తల్లి కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా మూడు రోజులపాటు కొడుకు శవం వద్దే విలపిస్తూ కూర్చుంది. శవం కుళ్లిపోయి వాసన రావడంతో ఇరుగుపొరుగువారికి అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో వెంకట రాజేష్(37)కి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె తల్లి కూడా వారితో పాటే నివసిస్తోంది. ఇక ఎంతో అన్యోన్యంగా సాగే భార్యాభర్తల మధ్య కలతలు చెలరేగాయి. భర్తతో విభేదాల కారణంగా భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను విడిచి వెళ్లిపోవడంతో రాజేష్, అతడి తల్లి మానసికంగా కుంగిపోయారు. ఈ నెల 5న రాత్రి రాజేష్ నిద్రపోతూ ఉదయం తనను ఆలస్యంగా నిద్రలేపాలని తల్లికి చెప్పాడు. సరేనన్న తల్లి ఉదయం అతడిని నిద్రలేపలేదు. ఇక సాయంత్రం అవుతున్నా కొడుకు నిద్రలేవకపోయేసరికి తల్లి లేపేందుకు ప్రయత్నించింది.

అతడిలో కదలికలు లేకపోయేసరికి కొడుకు మరణించినట్లు గ్రహించి అక్కడే కుప్పకూలిపోయింది. ఈ విషయాన్నీ ఎవరికి చెప్పకుండా కొడుకు శవం వద్దనే విలపిస్తూ ఉండిపోయింది. ఇలా మూడు రోజులు గడిచిపోయాయి. శవం మూడు రోజులుగా ఇంట్లోనే ఉండడంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో భరించలేని ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న రాజేష్ మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed