- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైరల్ వీడియో: ఛీ ఛీ.. నీచం.. పానీపూరీ నీటిలో మూత్రం కలిపి..
దిశ, వెబ్డెస్క్: పానీపూరీ అంటే ఇష్టపడని వారుండరు. ఇక అమ్మాయిలకైతే అది అంటే ప్రాణమనే చెప్పాలి. రోడ్డుపక్క ఉండే పానీపూరి బండి కనిపిస్తే చాలు అందరూ ఆగి మరీ తింటుంటారు. ఆరోగ్యానికి అవి మంచిది కాదు అని తెలిసినా ఆ.. ఒక్కరోజుకు ఏం పోతుందిలే అని లాగించేవాళ్లు లేకపోలేదు. అయితే రోడ్డు పక్కన పానీపూరీ బండి దగ్గర శుభ్రత తక్కువ ఉంటుందని, అక్కడ వాడే నీరు మురికి కాలువ నుంచి తెస్తారని, ఆ పూరీల పిండిని కాలితో తొక్కుతారని ఇలా చాలా రకాల వార్తలను ఇప్పటివరకు మనం వినే ఉన్నాం.. ఇంకొన్నిసార్లు చూసాం కూడా.. శుభ్రత లేకుండా పానీపూరీ బండివాడు ఒళ్లంతా రుద్దుకొని, అక్కడ ఇక్కడ చేతులు పెట్టిన వేళ్లతో ఆ నీళ్లలో ముంచి.. అబ్బా చెప్తుంటేనే చిరాకు గా ఉందా.. అయితే ఈ వీడియో చూడండి.. చిరాకు కాదు వాంతులు కూడా వస్తాయి.
అసోంలోని ఒక పానీపూరీ బండి వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. పానీపూరీ నీటిలో మూత్రాన్ని కలిపి అమ్మేశాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గౌహతిలోని ఓ వ్యక్తి పానీపూరీ బండి నడుపుతున్నాడు. అతను ఆ పానీపూరీ నీటిలో మూత్రాన్ని కలపడం అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీరు తినే పానీపూరీ అంత టేస్ట్ గా ఉండడానికి కారణం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో చుసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారి పోలీసుల వరకు చేరింది. వారు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యక్తిని వెతికి పట్టుకొని జైల్లో వేశారు. ఏదిఏమైనా రోడ్డుపైన తినేవారు ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకొని తినడం మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.
Shocking!A street vendor(pani puri saller) has been arrestd in Guwahati after viral a sensational video in which he mixed his urine with water and using the same Water in Pani Puri.#ViralVideo #Guwahati @ABPNews @ANI @the_viralvideos @ViralPosts5 @indiatvnews @TheQuint @SkyNews pic.twitter.com/ncekjhMeh1
— Mamun Khan (@Mk817Khan) August 20, 2021