పెళ్లి కుదరడం లేదని ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:12 Oct 2020 9:26 AM  )
పెళ్లి కుదరడం లేదని ఆత్మహత్య
X

దిశ, వెబ్‎డెస్క్: పెళ్లి కుదరడం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన సోమవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సప్తగిరి కాలనీకి చెందిన నస్ఫురి సురేష్ ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్‌గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. పెళ్లి సంబంధాలు చూస్తున్నా వివాహానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో సురేష్ ఈ విషయంపై బాధపడ్డాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed