తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

by Shyam |   ( Updated:2021-02-08 10:12:47.0  )
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్య, ఉద్యోగ రంగాలలో అగ్రవర్ణ పేదలకు (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్–ఈడబ్ల్యూఎస్) పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ అయినా కాకపోయినా అన్ని విద్యా సంస్థలలో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యా సంస్థలలోనూ అమలవుతాయని పేర్కొన్నారు. రాజ్యాంగానికి 2019లో చేసిన 103వ సవరణ ప్రకారం ఇప్పటికే ఇది కేంద్ర ప్రభుత్వస్థాయిలో అమలులో ఉంది. తెలంగాణలోనూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించారు.

అందుకు అనుగుణంగా జీవో విడుదలైంది. అన్ని సంస్థలలో పది శాతం మేర రిజర్వేషన్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం ఈ పది శాతం రిజర్వేషన్ విధానం వర్తించదన్నారు. మైనారిటీ విద్యా సంస్థలలోనూ వర్తించదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ వర్తిస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలే తెలంగాణలోనూ అమలవుతాయని పేర్కొన్నారు. సవరణలు, మార్పులు అనివార్యమైతే విడిగా మార్గదర్శకాలను, విధివిధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ల విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యాచరణ ఖరారు చేసిన సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed