- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటల స్కెచ్‌తో టీఆర్ఎస్‌కు ఝలక్.. కమలంలోకి కీలక నేతలు
దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ వేదికగా సమీకరణాలు ఎఫ్పుడు ఏ విధంగా మారుతాయో అంతు చిక్కకుండా తయారైంది. అందివచ్చిన ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మల్చుకుంటున్న బీజేపీ, టీఆరెఎస్ పార్టీల నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం గులాభి నాయకులకు ఝలక్ ఇచ్చినట్టే అయిందన్న చర్చలు మొదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌడ సామాజిక వర్గంతో మమేకం అయ్యేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరు కానున్న ఈ సభ ద్వారా గౌడ సామాజిక వర్గం ఓటర్లను మచ్చిక చేసుకోవాలని భావించారు. కానీ, అనూహ్యంగా ఈటల వేసిన స్కెచ్‌తో అధికార టీఆర్ఎస్ పార్టీ అంచనాలను తలకిందులు చేసిందా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గౌడ సామాజిక వర్గంలో పెద్దగా ఉన్న, జమ్మికుంట మాజీ ఎంపీపీ నేరెళ్ల రాజమౌళి గౌడ్ కాషాయం కండువా కప్పుకున్నారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన ఆయనకు గౌడ సామాజిక వర్గంలో ఉన్న పట్టును తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ఈటల రాజేందర్ బీజేపీలో చేర్పించుకున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ గౌడ సామాజిక వర్గాన్ని గులాభి ఖాతాలో వేసుకోవాలన్న ప్రయత్నాల్లో మునిగిపోతే బీజేపీ వారి ప్రయత్రాలకు ఆదిలోనే చెక్ పెట్టిందన్న చర్చ సాగుతోంది.