కండోమ్‌కు చిల్లు… 4 ఏళ్ల జైలు శిక్ష!

by Anukaran |
కండోమ్‌కు చిల్లు… 4 ఏళ్ల జైలు శిక్ష!
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్‌లో ఆసక్తికరన ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలికి తెలియకుండా ఓ యువకుడు కండోమ్‌కు చిల్లు పెట్టాడు. దీంతో ఆ బ్రిటన్ వ్యక్తికి(47) అక్కడి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాళ్లోకి వెళితే… గతకొంత కాలంగా వాళ్లిద్దరూ సన్నిహింతంగా ఉంటున్నారు. అయితే.. అతడికి దగ్గర కావాలంటే కచ్చితంగా కండోమ్ వాడాల్సిందేనని ఆమె కండిషన్ పెట్టడంతో అతను కూడా ఓకే అన్నాడు.

తరువాత ఆమెకు తెలీకుండా తను వాడే కండోమ్‌లకు చిల్లులు పెట్టేవాడు. ఓ రోజు బెడ్‌పై కండోమ్ ప్యాకెట్, సూది ఉండటాన్ని గమనించిన ఆమెకు అనుమానం కలిగింది. ఆ తరువాత చెత్త బుట్టలోకి తొంగి చూస్తే తన అనుమానం నిజమైంది. విషయం కోర్టు వరకూ వెళ్లడంతో..నిందితుడు నేరం చేశాడని కోర్టు నిర్ధారించింది. ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టు అతడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Next Story