- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పొలంలో బావి కనిపించడంలేదు.. వెతికి పెట్టండి సార్
దిశ, వెబ్‌డెస్క్ : మనం సినిమాలో చూసి నవ్వుకున్న ఎన్నో సంఘటనలు మన నిజ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అలా పోసాని నటించిన రాజా గారి చేపల చెరువు సినిమా అందరికి తెలిసిందే. ఇప్పుడు అందులో ఒక సీన్ రిపీట్ అయ్యింది. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని మావినహొండ గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. అయితే చాలా పొలాల్లో బావులు ఉంటాయి. అయితే ఓ రైతు తన పొలంలో బావి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొలంలో బావి కనిపించకపోవడమేంటనీ ఆశ్చర్య పోతున్నారా.. మావినహొండ గ్రామంలో మల్లప్ప అనే రైతు తన కుమారులతో కలసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన పొలంలోని బావి కనిపించడం లేదని తన కుమారులతో కలసి రాయబాగ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చూసిన పోలీసులు ఒకే సారి షాక్ అయ్యారు.
అయితే మల్లప్ప తన పొలంలో బావి తవ్వించినట్లు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులను కాజేశారు కొందరు. అయితే ఆ విషయం రైతుకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత మల్లప్పకు నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులు చూసిన రైతు తన కుమారులు షాక్ అయ్యారు. మీరు మీ పొలంలో బావి తవ్వించుకున్నారు. బావి తవ్వినందుకు తీసుకున్న రుణం వెంటనే తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతు కుంటుంబం.. అసలు ఏం జరిగింది మేము బావి తవ్వడం ఏంటీ అని ఆరా తీయగ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు తప్పుడు రికార్డు సృష్టించి ప్రభుత్వ నిధులు కాజేశారని తెలిసింది. దీంతో తెలివిగా ఆలోచించిన రైతు కుటుంబం మా పొలంలో తవ్విన బావి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.