సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా?

by Shyam |
BC Community Leaders
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 14న నల్గొండ జిల్లా హాలియాలో సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభను ప్రజారోగ్యం దృష్ట్యా రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ సోమ‌వారం రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. కరోనా తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.69ని జారీ చేసిందని తెలిపారు. అయితే.. రాష్ట్రానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వ జీవోను ఉల్లంఘిస్తూ సభ నిర్వహించడం సరికాదని అన్నారు. స‌భ కార‌ణంగా క‌రోనా పెరిగే ప్రమాద‌ముంద‌ని, ఇది ప్రజారోగ్యం మీద తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ 14వ తేదీన నల్గొండ జిల్లా హాలియాలో జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను రద్దుచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు రాష్ట్ర డీజీపీకి ఆదేశాలివ్వాలని యుగంధ‌ర్ గౌడ్ కోరారు.

Advertisement

Next Story