- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రంజాన్ వేళ.. మసీదులో బాంబు పేలుడు, 12 మంది మృతి
by Sumithra |

X
కాబుల్: రంజాన్ వేళ అప్ఘనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఓ మసీదులో శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా, మరో 15 మందికి తీవ్ర గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదులో ప్రార్థనలు ప్రారంభం కాగానే ఈ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనకు తామే బాధ్యుల మంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదని పోలీసులు పేర్కొన్నారు. మత గురువు టార్గెట్‌గా బాంబులను అమర్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story