- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Weather Alert : అల్పపీడన ప్రభావం.. ఏపీకి కుండపోత వర్షాలు

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay Of Bengal)లో అల్పపీడనం(LPA) ప్రభావంతో ఏపీ(AP)లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(Disaster Management Organization) మంగళవారం కీలక ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, రానున్న 2 రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు(Tamilanadu) తీరం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బుధవారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. పార్వతీపురం మన్యం, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.