Weather Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాలు

by M.Rajitha |
Weather Alert : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఈ నెల 15 నాటి మరో అల్పపీడనం(LPA) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్(South Andaman) సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా బలపడుతుందని తెలిపింది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు(Tamilanadu) తీరానికి చేరుతుందని తెలియజేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 16న ఏపీ(AP)లోని నెల్లూరు, ప్రకాశంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 17న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని.. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పింది. ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, తీవ్ర వాయుగుండంగా మారి, తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ(Telangana)లో కూడా అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు అవకాశాలున్నాయని సమాచారం.

Advertisement

Next Story