Sex & Science : వంధ్యత్వానికి దారి తీసే శృంగార సమస్యలు ఏంటి..?

by Bhoopathi Nagaiah |
Sex & Science : వంధ్యత్వానికి దారి తీసే శృంగార సమస్యలు ఏంటి..?
X

మేడమ్.. అన్నయ్య పెళ్లై ఆరేళ్లు అవుతుంది. పిల్లల కోసం చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లినా ఫలితం లేదు. వాళ్లిద్దరికి అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉన్నాయి. అసలు వంధ్యత్వానికి దారితీసే ప్రత్యేకమైన కారణాలు దంపతులిదరిలో ఏంటో చెప్తారా? - రజని, మంచిర్యాల

రకమైన కుటుంబ నియంత్రణ సాధనాలు ఉపయోగించకుండా మందులు వాడకుండా క్రమం తప్పకుండా ఒక ఏడాదిపాటు శృంగారంలో పాల్గొన్నప్పటికీ పిల్లలు పుట్టక పోవడాన్ని ప్రాథమిక వంధ్యత్వం అంటారు. శారీరిక, హార్మోన్ల లోపాలు కాకుండా వంధ్యత్వానికి దారి తీసే శృంగార పరమైన కారణాలు ఉన్నాయి

1) కలయిక జరగక పోవడం:

పెళ్ళైనా ఒక్కసారి కూడా కలయిక జరగక పోవడం వల్ల 5% మందికి పిల్లలు పుట్టరని సెక్సలాజిస్ట్ డాక్టర్ జెఫ్కాక్ చెప్పారు. కొనిసార్లు పెళ్ళైన 15 సంవత్సరాల వరకు కూడా ఏ శారీరిక వ్యాధులు, హార్మోన్ల లోపాలు లేకపోయినా కేవలం మానసిక కారణాల వలన దంపతుల్లో కొంతమందికి పిల్లలు పుట్టరని తెలిసింది.

2)పురుషుల వైపు నుంచి శృంగార లోపాలు.

a) అంగస్తంభన సమస్యలు/ప్రాథమిక,ద్వితీయ కారణాలు.

b)వీర్య స్ఖలన లోపాలు. పెర్ఫార్మెన్స్ యాంక్సయిటీ, భయం వలన వెజినల్ ఇంటర్ కోర్సు కంటే ముందే వీర్యం వెజైనా బయటే స్ఖలించబడటం.

C)అంగ స్తంభన ఉన్నప్పటికీ భార్యకు గర్భం వస్తుందన్న భయం లేదా భార్య పట్ల ఇష్టం లేక పోవడం వలన కూడా వీర్య స్ఖలనం కాక పోవడం.

D)స్ఖలించబడిన వీర్యం బయటకు రాకుండా తిరిగి వెనక్కి మూత్రాశయం లోకి వెళ్లిపోవడం

E)వీర్య స్ఖలనం అనేక సార్లు అవడం వలన వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ఇది habituated masterbation అనే మనోలైంగిక సమస్యలో ఉంటుంది.

3)స్త్రీల వైపు నుంచి వంధ్యత్వ లోపాలు

a) భయంతో భర్త పట్ల అయిష్టతతో వెజైనా కండరాలను అనియంత్రణగా బిగదీసే వెజినిసమస్ అనే స్థితిలో కలయిక దుర్లభం అవుతుంది. ఇది పురుషులు భార్యలతో ప్రవర్తించే దౌర్జన్య అహంకార ధోరణులకు భార్యల తిరస్కార చర్యగా భావించవచ్చు.

B) నొప్పితో కూడిన సంయోగం :

నొప్పి కలుగుతుందన్న భయం... భర్త దౌర్జన్యంగా ప్రవర్తించడం వీటితో పాటు, భర్త, అత్త, ఆడబిడ్డల, వరకట్న హింసలు, పని వత్తిడి, చదువు మధ్యలో ఆగిపోవడం, అవాంఛిత గర్భము వచ్చి చదువు, కెరీర్ నాశనం అవుతాయేమో అనే భయం, పుట్టింటి బంధాలకు దూరం కావాల్సి రావడం, పెళ్లి తర్వాత స్త్రీల ఆశయ, ఆకాంక్షలు తీరకపోవడం వలన వచ్చే డిప్రెషన్ వలన కూడా స్త్రీలలో సెక్స్ పట్ల విముఖత ఉండి avoid చేయడం కూడా ఒక కారణం. ఒక వేళ కలయిక జరిగినా, డిప్రెషన్ వలన హార్మోనల్ ఇన్ బ్యాలెన్సులతో అండం సరిగా విడుదల కాక గర్భం రాదు.

C) వెజైనాలో ఉండే ఆమ్లా , క్షార పీహెచ్‌లలో తేడా వీర్య కణాలను నాశనం చేస్తాయి. స్రీలు పూర్తిగా శృంగారంలో ఉద్దీపన చెందక పోవడం కూడా ఈ స్ధితికి కారణం. దీనికి పరిష్కారంగా వాడే వెజినల్ లూబ్రి కేషన్స్ వలన కూడా వీర్య కణాలు నాశనము అవుతాయి. ఇవి స్త్రీ పురుషుల వైపు నుంచి వంధ్యత్వానికి దారి తీసే శృంగార కారణాలు.

భార్యాభర్తలు ఇద్దరూ marital therapist వద్ద కౌన్సిలింగ్ & థెరపీకి వెళ్ళాలి.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story