- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
35 ఏళ్ల నేను శృంగార కోరికలు తీర్చుకునేది ఎలా..? నా భర్త ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడేమో కదా!

మేడమ్, దయచేసి నా అనుమానాలకు తీర్చరా! నా వయస్సు 35 సంవత్సరాలు. మా వారి వయస్సు 51 సంవత్సరాలు. మా ఇద్దరి వయసులో 16 సంవత్సరాల తేడా ఉంది. పెళ్ళయిన కొత్తలో నాకు సెక్స్ పట్ల అంత కోరిక ఉండేది కాదు. కానీ, మా వారికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత ఆయన సమాజానికి దగ్గరై బయటనే ఎక్కువ సమయం గడిపి నన్ను పట్టించుకోవడం లేదు. అయితే, ప్రస్తుత సమస్య ఏంటంటే నాకు ఇప్పుడు సెక్స్ కోరికలు ఎక్కువయ్యాయి. ఆయనకేమో తగ్గాయి. గత నాలుగు నెలల నుంచి ఆయన అంగం గట్టిపడటం లేదు. ఇంతకు ముందు అప్పుడప్పుడు శీఘ్రస్ఖలనం అయ్యేది. ఇప్పుడు సడెన్‌గా ఇలా ఎందుకైంది? మా ఆయనకు గత 8 సంవత్సరాలుగా షుగర్ వ్యాధి ఉంది. దీనివల్ల ఏమైనా సమస్య ఉందా? మేడమ్, నాదొక అనుమానం, మా వారు వాళ్ల కొలీగ్ (50 సంవత్సరాల స్త్రీ)తో క్లోజ్ ఉండటం చూశాను. ఆమెకి మా వారంటే చాలా అభిమానం. ఆ అభిమానం ఎక్కువై ‘శారీరకంగా దగ్గరయ్యారా’ అని అనుమానం కలుగుతోంది. భార్య దగ్గర కాకుండా ఇతర స్త్రీల దగ్గర అంగం బాగా పనిచేస్తుందని చదివాను. ఇది నిజమేనా? అయితే, నాకు ప్రస్తుతం సెక్స్ కోరికలు తీరకపోయేసరికి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఆయనకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. నేను ఏ రకంగా సెక్స్ కోరికలు తీర్చుకోగలను?
దంపతుల మధ్య వయస్సులో అంతరం ఎక్కువుంటే, ఇలా ఖచ్చితంగా సెక్స్ సమస్యలకు దారి తీస్తుంది. సాధారణంగా స్త్రీలలో, పిల్లలు పెద్దగై, బాధ్యతలు తగ్గిపోయ 35 సంవత్సరాల వయస్సు తర్వాత, వారు సెక్స్ జీవితం మీద ఆసక్తి చూపుతారు. దేహం కూడా హార్మోన్లకు అడ్జెస్ట్ అయ్యే దశ ఇది. పురుషులకు 45 సంవత్సరాలయి, దాటాక మెల్లగా సెక్స్ సమస్యలు మొదలవుతాయి. సరిగ్గా ఆ సమయానికి స్త్రీలలో సెక్స్‌పై ఆసక్తి పెరుగుతుంది. సరే! ఇక మీ విషయానికొస్తే మీ వారికి షుగరు వ్యాధి ఉంది. పైగా, వాటికి మందులు కూడా వాడుతున్నారు. చక్కెర వ్యాధివల్ల అంగానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల రక్తసరఫరా తగ్గి అంగస్తంభన లోపం ఏర్పడుతుంది. పైగా చక్కెర శాతాన్ని కంట్రోల్ చేసే మందుల వల్ల కూడా సెక్స్ సమస్యలు వస్తాయి. మీ వారి డయాబెటాలజిస్టుని కలసి మందు. రకం, డోసు మార్చగలరేమో కనుక్కోమనండి. సొంతంగా మాత్రం ఈ పనులు చేయొద్దు, మందు వేస్కోవడం ఆపొద్దు. షుగరుతో పాటుగా శరీరంలో బయటపడని అనేక వ్యాధులుంటాయి. గుండెవ్యాధితో మొదలై వరిబీజం దాకా! సెక్సాలజిస్ట్‌ను సంప్రదిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారానికో, పది రోజులకోసారో మంచి అంగస్తంభన వస్తోందంటున్నారు. కాబట్టి సెక్స్ థెరపీతో మీ వారి సమస్య తగ్గే అవకాశం ఉంది.
అలాగే, మీ ఆయనపై మీకున్న అనుమానం గురించి.. కొలీగ్స్ స్నేహంగా ఉన్నంత మాత్రాన వారిమధ్య సెక్స్ సంబంధం ఉందనుకోవడం తప్పు. మీ వారికి వయసు, షుగరు వ్యాధి వల్ల ఈ సమస్య వచ్చి ఉండవచ్చు. అంతేకాని, పరాయి స్త్రీలతో సంబంధం వల్ల కాదు. మీ అనుమానం పక్కన పెట్టిసెక్సాలజిస్ట్‌ను కలవండి. మీ దగ్గర రాని అంగస్తంభన, పరాయి స్త్రీ వద్ద కూడా వచ్చే అవకాశం లేదు. సెక్స్ థెరపీలో దంపతులిద్దరికీ చికిత్స ఉంటుంది. దీనిని తీస్కోవడం వల్ల షుగరు ఉన్నా వారానికి కనీసం రెండు సార్లయినా పూర్తి స్థాయి సెక్కులో పాల్గొనవచ్చు. మీరు ఆందోళన మాని మీ భర్తతో కలసి సెక్సాలజిస్ట్‌ను సంప్రదించండి. ఈ ఉత్తరం మీ వారితో చదివించండి. ఆయనలో సెక్సు కోరికపై ఆసక్తి తగ్గి, సెక్స్ సమస్య వచ్చినంత మాత్రాన మీ గురించి నిర్లక్ష్యం వహించాల్సిన అవసరం లేదు. తన సమస్యలను తగ్గించుకోని మిమ్మల్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇద్దరూ కౌన్సెలింగ్‌కు అటెండ్ అవండి.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్