అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకోవడం తప్పా? పిల్లలు పుట్టడంలో ఇబ్బంది అవుతుందా?

by Bhoopathi Nagaiah |
అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకోవడం తప్పా? పిల్లలు పుట్టడంలో ఇబ్బంది అవుతుందా?
X

నా వయసు 19. సెక్స్ గురించి ఆలోచిస్తే యోనిలో ద్రవాలు వస్తాయి. దాంతో హస్తప్రయోగం చేసుకుంటాను. అయితే అది మగవాళ్లు మాత్రమే చేస్తారని విన్నాను. ఆడవాళ్లు చేయటం తప్పా? ఎంత ప్రయత్నించినా ఈ అలవాటు మానలేకపోతున్నాను. ఈ అలవాటు వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్య వస్తుందా? పిల్లలు పుట్టడంలో ఇబ్బంది తలెత్తుతుందా?

స్తప్రయోగం అనేది స్త్రీ. పురుషులిద్దరి శరీర ధర్మానికి సంబంధించిన ఓ సహజమైన శృంగార స్పందన, ఒక వ్యక్తీకరణ. అనేక మనో, సామాజిక, వ్యవస్థాపరమైన నిబంధనల వల్ల పురుషులకంటే తక్కువ మంది స్త్రీలలో ఈ అలవాటు ఉంటుంది. దీనికి పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టడానికి, హస్తప్రయోగానికి సంబంధం లేదు. అయితే నీది చిన్న వయసే. బహుశా విద్యార్థినివి అయి ఉంటావు. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సంపాదించే టార్గెట్స్ మీద దృష్టి పెట్టు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story

Most Viewed