ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

by Hamsa |
ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ నటుడు, నిర్మాత ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన ‘పుష్ప’(Pushpa) సినిమాలో విలన్‌గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఏకంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ‘వెట్టైయాన్(Vettaiyan), ఆవేశం వంటి చిత్రాలతో మెప్పించిన ఫహాద్ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఇటీవల నటించిన సినిమా ‘బోగన్ విల్లియా’(Bougainvillea). అమల్ నీరద్(Amal Neerad) తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలై మంచి హిట్ అందుకుంది. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌(Streaming)కు రెడీ అయింది. డిసెంబర్ 13 నుంచి సోనీలివ్‌(SonyLIV)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Advertisement

Next Story

Most Viewed