Jigra movie OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న అలియా భట్ ‘జిగ్రా’ సినిమా

by Hamsa |
Jigra movie OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న అలియా భట్ ‘జిగ్రా’ సినిమా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt), వేదాంగ్ రైనా(Vedang Raina) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జిగ్రా’(Jigra). వాసన్ బాల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీని.. కరణ్ జోహార్(Karan Johar), అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్, సోమెన్ మిశ్ర (Somen Mishra) నిర్మించారు. అయితే దీనిని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి(Rana Daggubati ) తెలుగులో రిలీజ్ చేశారు. అక్కా, తమ్ముడి సెంటిమెంట్‌తో వచ్చిన ‘జిగ్రా’ అక్టోబర్ 10 థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌(Streaming)కు రెడీ అయింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది. ‘జిగ్రా’ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) సొంతం చేసుకుంది. డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అలియా భట్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.



Next Story

Most Viewed