మల్లారెడ్డి చాలా తెలివైన రాజకీయ నాయకుడు: KTR

by GSrikanth |
మల్లారెడ్డి చాలా తెలివైన రాజకీయ నాయకుడు: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్లీనరీపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రాండ్‌‌గా జరుపుకునేందుకు వీలు లేకుండా పోయిందని.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్లీనరీ ఉంటుందని అన్నారు. 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ 24 ఏళ్లుగా తన మనుగడ సాగిస్తోంది అంటే గొప్ప విషయమన్నారు. పదేళ్లు అధికారం, 14 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నామని చెప్పారు. కేసీఆర్ సీఎంగా వుంటే బాగుండేది అని ప్రతి ఒక్కరూ అంటున్నారని అన్నారు. తెలంగాణలో జరిగిన మార్పును ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి రేవంత్ రెడ్డి ఆపసోపాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, చేవెళ్ళ పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జి అని చెప్పి మార్చుకున్నారని సెటైర్ వేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం నడుస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేర మాటలు తప్ప నాలుగు నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదని విమర్శించారు. రైతుబంధు, పంటలకు బోనస్, నిరుద్యోగులకు భృతి, ఫ్రీ స్కూటీ, తులం బంగారం అన్నారు ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఒక్కసారి మోసపోయాము.. రెండోసారి మోసపోతే మన తప్పు అవుతుందని అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు ఆగస్టు 15 అని దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే, కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఎవరి గైడెన్స్‌లో పని చేస్తున్నారో అర్ధం అవుతుందని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ పద్మారావుకు ఇవ్వడంతో తెలంగాణ ఉద్యమ కారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. హరీష్ రావు రాజీనామా సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి చాలా తెలివైన రాజకీయ నాయకుడు.. ఈటల రాజేందర్ ను బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed