హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ముంబైకి భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం

by Harish |
హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ముంబైకి భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్‌ బోణీ కోసం ఎదురుచూస్తోంది. గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు.. బుధవారం హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ దూరం కానున్నాడు. అతనికి ఇంకా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గుజరాత్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో సూర్యకుమార్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌తో మ్యాచ్ నాటికి అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చినా.. అతను ఇంకా ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయకపోవడంతో మ్యాచ్‌కు దూరంకానున్నాడని తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌లో అతని రాకపై అనుమానాలు నెలకొన్నాయి. టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో భాగంగా అతని విషయంలో బీసీసీఐ కూడా రిస్క్ తీసుకోవద్దని భావిస్తోంది. సౌతాఫ్రికా పర్యటనలో చీల మండల గాయానికి గురైన సూర్య జనవరిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్‌సీఏలో చేరిన అతను ఫిట్‌నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు.

Advertisement

Next Story