ఆర్సీబీకి బిగ్ షాక్.. టీమ్ కు స్టార్ బ్యాటర్ దూరం

by Javid Pasha |
ఆర్సీబీకి బిగ్ షాక్.. టీమ్ కు స్టార్ బ్యాటర్ దూరం
X

దిశ, వెబ్ డెస్క్: మొదటి మ్యాచ్ లోనే స్టార్ టీమ్ ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసి మంచి ఫామ్ లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. గాయంతో స్టార్ బ్యాటర్ రజత్ జట్టు నుంచి వైదొలిగినట్లు ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రకటించింది. ‘‘మడమ నొప్పితో రజత్ పటిదార్ ఈ సీజన్ లో జట్టుకు దూరం కానుండటం బాధాకరం. కానీ అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలనేది కోచ్ గానీ మేనేజ్ మెంట్ గానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

కాగా ఆదివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రజత్ పటిదార్ గాయం వల్ల ఆడలేకపోయాడు. రజత్ గత ఐపీఎల్ సీజన్ లో మొత్తం 8 మ్యాచులు ఆడి 333 పరుగులు సాధించాడు. ఇక గత సీజన్ లో ప్లేఆఫ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి లక్నో జట్టు ప్లేఆఫ్ ఆశలను దూరం చేశాడు.

Next Story

Most Viewed