- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
NTR : దేవర పార్ట్-2పై బిగ్ అప్‌డేట్.. హైప్ పెంచేస్తున్న ఎన్టీఆర్ కామెంట్స్

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) గతేడాది ‘దేవర’ (Devara) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. అలాగే ఈ మూవీకి సీక్వెల్ (sequel) ఉన్నట్లు కూడా క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ‘దేవర’ చిత్రాన్ని తాజాగా జపాన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ దేవర పార్ట్-2పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు.
ఈ సినిమా పార్ట్ 2 ఉంది కదా అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘అవును.. దేవర ప్రారంభం మాత్రమే. తరువాత వచ్చేది ఎవరి ఊహించనిది. ఈ సినిమాలో మీరు దేవర ప్రపంచాన్ని చూశారు, కానీ తదుపరిది వరాను ఆవిష్కరిస్తుంది. అలాగే దేవరకు నిజంగా ఏమి జరిగిందో క్లారిటీ వస్తుంది’ అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ప్రజెంట్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తారు. కాగా.. ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘NTRNEEL’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమా ‘వార్-2’తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాతే దేవర పార్ట్-2 సెట్‌లో ఎన్టీఆర్ అడుగుపెట్టానున్నాడని తెలుస్తుంది.
Ram Charan: ‘పెద్ది’ ఫస్ట్ లుక్ ఎఫెక్ట్.. భారీగా అమ్ముడుపోయిన ఆడియో రైట్స్