- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL: చివరి నిమిషయంలో ఆ జట్టు కెప్టెన్ చేంజ్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-14 చివరి దశకు చేరుకుంది. ఒక్కొక్క మ్యాచ్ మినహా దాదాపు లీగు మ్యాచులన్నీ అయిపోయాయి. ఇవాళ ప్లే ఆఫ్స్‌లో బెర్త్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైట్ జరుగనుంది. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సామ్ కరణ్ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో తక్షణమే జట్టు కెప్టెన్‌గా జితేశ్ శర్మకు యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది. మరోవైపు ఈ సీజన్‌లో జితేశ్ శర్మ ఘోరంగా విఫలం అయ్యారు. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన జితేశ్.. కేవలం 155 పరుగులు మాత్రమే చేశారు. ఆయనతో పాటు జట్టు ప్రదర్శన కూడా అలాగే కొనసాగింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయింది. 13 మ్యాచులు ఆడిన పంజాబ్.. కేవలం ఐదింట్లోనే గెలుపొందింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరింది.