PBSK Vs GT: తడబడిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు .. గుజరాత్ బౌలర్ల ధాటికి మిడిలార్డర్ ఢమాల్

by Shiva |
PBSK Vs GT: తడబడిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు .. గుజరాత్ బౌలర్ల ధాటికి మిడిలార్డర్ ఢమాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. ముందు టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సామ్ కర్రాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం ఓపెనర్లు కర్రాన్ 19 బంతుల్లో 30, ప్రభుసిమ్రాన్ సింగ్ 21 బంతుల్లో 35 పరుగు చేసి చక్కటి ఆరంభాన్ని అందించారు. అయితే, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు స్కోర్ సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు.జితేష్ శర్మ 12 బంతుల్లో 13 పరుగులు చేయగా.. రిలీ రొస్సొ, లియామ్ లివింగ్‌స్టోన్, శషాంక్ సింగ్, అశుతోష్ శర్మ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

ప్రస్తుతం పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లను కోల్పోయి 139 పరుగులు చేసింది. హరిప్రీత్ సింగ్ 15 బంతుల్లో 12 పరుగులు, హరిప్రీత్ బ్రార్ 11 బంతుల్లో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే.. సాయి కిషోర్ 3 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. ఇక నూర్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లను నేలకోల్చాడు. అదేవిధంగా స్పిన్నర్ రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

Advertisement

Next Story