తెలుగు కుర్రాడి ఇంటికి సచిన్.. తిలక్ వర్మ ఇంట్లో ముంబై క్రికెటర్ల సందడి

by Vinod kumar |
తెలుగు కుర్రాడి ఇంటికి సచిన్.. తిలక్ వర్మ ఇంట్లో ముంబై క్రికెటర్ల సందడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ తన ఇంట్లో ముంబై ఇండియన్స్ జట్టుకు డిన్నర్ ఇచ్చాడు. సచిన్‌తోపాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు తిలక్ ఆతిథ్యాన్ని స్వీకరించారు. తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన తిలక్ వర్మ ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. తిలక్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులు క్రికెటర్లతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘నా ముంబై ఇండియన్స్ ఫ్యామిలీకి మా ఇంట్లో డిన్నర్ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన రాత్రిని నేను, నా కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేం. వచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ తిలక్ వర్మ ఈ ఫొటోలను ట్వీట్ చేశాడు.

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ఈ సీజన్లోనూ ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌లో ముఖ్య ఆటగాడిగా ఎదిగాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింట్లోనూ ఆడిన తిలక్ వర్మ 59 యావరేజ్, 150 స్ట్రయిక్ రేట్‌తో 177 రన్స్ చేశాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై, సన్‌రైజర్స్ చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడి చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. విజయాల హ్యాట్రిక్ సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ముంబై ఇండియన్స్‌లో ఇషాన్ కిషన్‌తోపాటు తిలక్, రోహిత్, సూర్య కీలకం కానున్నారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్ తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ మర్‌క్రమ్, అభిషేక్ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed