పూరన్ మెరుపులు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

by Javid Pasha |
పూరన్ మెరుపులు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: లక్నో బ్యాటర్ పూరన్ ఆర్సీబీ బౌలర్ల భరతం పట్టాడు. వేసిన బాల్ వేసినట్టు ఫోర్లు, సిక్సర్ల రూపంలో బౌండరీకి తరలించాడు. కేవలం 15 బంతుల్లో వైన్ పార్నెల్ బౌలింగ్ లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అందులో 6 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. కాగా అంతకు ముందు టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ తరఫున కోహ్లీ, డెప్లెసిస్, మ్యాక్స్ వెల్ హాఫ్ సెంచరీలు చేశారు.

Advertisement

Next Story