- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందా?. చాన్స్‌లు ఎలా ఉన్నాయంటే?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడటంతో నాకౌట్ బెర్త్ ఆశలు కాస్త సన్నగిల్లాయి. అయితే, మిగతా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గితే జట్టుకు ఢోకా లేదు. కానీ, ఒక్క మ్యాచ్‌లో ఓడినా బెర్త్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకం కానుంది.
ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ ఆశలు ఇలా..
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో హైదరాబాద్ 6 విజయాలు 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నది. ఎస్ఆర్‌హెచ్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేడు లక్నోతో, ఈ నెల 16న గుజరాత్, 19న పంజాబ్‌తో తలపడనుంది. చెన్నయ్, లక్నో జట్లు కూడా 12 పాయింట్లతోనే ఉన్నాయి. మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే 18 పాయింట్లతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయమే. ఒకవేళ హైదరాబాద్ ఒక్క మ్యాచ్‌లో ఓడి.. చెన్నయ్, లక్నో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎస్‌ఆర్‌హెచ్ ఆశలు వదులుకోవాల్సిందే. హైదరాబాద్‌తో సహా మిగతా రెండు జట్లు కూడా ఒక్కో మ్యాచ్ కోల్పోతే.. ఢిల్లీ కూడా పోటీలోకి వస్తుంది. అప్పుడు 16 పాయింట్లు, మెరుగైన నెట్‌రన్‌రేట్ ఉంటే తప్ప హైదరాబాద్ ముందడగు వేయలేదు.
పుంజుకోవాల్సిందే
తొలి మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓటమితో హైదరాబాద్ ఈ సీజన్‌ను పేలవంగానే ఆరంభించింది. ఆ తర్వాత విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎస్‌ఆర్‌హెచ్ సంచనాలు సృష్టించింది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. అయితే, ఆ జట్టు బ్యాటు తడబడటంతో గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓడిపోయింది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ పుంజుకోవాల్సిన సమయం వచ్చింది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలవడం తప్పనిసరి. మూడు మ్యాచ్‌లు సొంతగడ్డపై జరగడం హైదరాబాద్‌కు సానుకూలంశం. హెడ్ ఫామ్‌లోనే ఉన్నా అభిషేక్ శర్మ, క్లాసెన్ తడబడటం ఎస్‌ఆర్‌హెచ్‌ను నష్టాలోకి నెట్టుతోంది. వారు మరోసారి తమ బ్యాటుకు పనిచెప్పాల్సిందే. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ నుంచి ఆల్‌రౌండర్ మెరుపులు కావాల్సిందే. ఈ సీజన్‌లో లక్నోను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. స్వల్ప లక్ష్యాలను కాపాడుకునే బౌలింగ్ సామర్థ్యాలను కలిగిన ఉండటంతోపాటు బ్యాటింగ్ పరంగా కూడా లక్నో మెరుగ్గా ఉంది. కాబట్టి, లక్నోపై హైదరాబాద్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉన్నది.