ముంబై జట్టులోకి హర్విక్ దేశాయ్

by Harish |
ముంబై జట్టులోకి హర్విక్ దేశాయ్
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ విష్ణు వినోద్ గాయం కారణంగా ఐపీఎల్-17 మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ గురువారం వెల్లడించింది. అలాగే, అతని స్థానంలో సౌరాష్ట్ర వికెట్ కీపర్, బ్యాటర్ హర్విక్ దేశాయ్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, హర్విక్‌ను ఎంత మొత్తానికి తీసుకున్నదో వెల్లడించలేదు. కాగా, కొత్తకాలంగా దేశవాళీలో హర్విక్ సౌరాష్ట్ర తరపున నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను 175 స్ట్రైక్‌రేట్‌తో 336 పరుగులు చేశాడు. అంతేకాకుండా, 2018లో అండర్-19 వరల్డ్ కప్‌ గెలిచిన భారత జట్టులో హర్విక్ సభ్యుడు. అయితే, ఈ సీజన్‌లో హర్విక్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ విష్ణు వినోద్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Advertisement

Next Story