- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సన్ రైజర్స్‌ను చిత్తు చేసి.. నాలుగో సారి ఫైనల్ చేరిన కలకత్తా
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో అత్యంత కీలకమైన క్వాలీఫయర్-1 లో హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. మంగళవారం గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో భారీగా రాణిస్తున్న ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు వెంట వెంటనే అవుట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం రాహుల్ త్రిపాఠి, క్లాసెన్ కొద్ది సేపు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగానే వెనుదిరిగి వెళ్లారు. దీంతో సర్ రైజర్స్ జట్లు 19.3 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో త్రిపాఠి 55, క్లాసెన్ 32, సమద్ 16, కమిన్స్ 30 పరుగులు మినహా ఎవరూ రాణించలేదు. కలకత్తా బౌలర్లలో స్టార్క్స్ 3, వరుణ్ చక్కవర్తి 2, రస్సెల్, నరైన్, హర్షిత రానా, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
కాగా 160 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కేకేఆర్ బ్యాటర్లు మొదటి బంది నుంచి దీటుగా ఆడారు. ఫోర్లు సిక్సర్లతో సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో కేవలం 13.4 ఓవర్లలోనే 164 పరుగులు చేసి విజయం సాధించారు. కేకేఆర్ బ్యాటర్లలో గుర్బాజ్ 23, నరైన్ 21, వెంకటేశ్ అయ్యర్ 51, శ్రేయస్ అయ్యర్ 58 పరుగులు చేశారు. ఈ విజయంతో కేకేఆర్ జట్టు నేరుగా ఐపీఎల్ 2024 ఫైనల్ చేరుకుంది. కాగా ఈ జట్టు ఫైనల్ చేరడం ఇది నాలుగో సారి కాగా గతంలో రెండు సార్లు ట్రోఫీని గెలుచుకుంది. క్వాలిఫైయర్-1లో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు ఎలిమినేటర్-1 లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 లో మే 24న తలపడనుంది.