IPL 2023: RR కెప్టెన్ సరికొత్త రికార్డు.. టాప్‌ స్కోరర్‌గా..

by Vinod kumar |
IPL 2023: RR కెప్టెన్ సరికొత్త రికార్డు.. టాప్‌ స్కోరర్‌గా..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. RR తరఫున అత్యదికగా రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అజింక్య రహానె రికార్డును వెనక్కి నెట్టేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ 25 బంతుల్లో 42 రన్స్ చేశాడు. దీంతో టాప్ రన్ లిస్టులో చేరిపోయాడు. RR తరఫున ఇప్పటి వరకు 118 మ్యాచ్‌లు ఆడగా.. 30.46 సగటుతో 3,338 పరుగులు చేశాడు. అంతకు ముందు అజింక్య రహానె 106 మ్యాచ్‌లు ఆడగా.. 35.60 సగటుతో 3,098 రన్స్‌ సాధించాడు. ఈ జాబితాలో షేన్‌ వాట్సన్‌, జోస్‌ బట్లర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు.

RR ఆల్‌టైమ్‌ టాప్‌ స్కోరర్లు..

సంజూ శాంసన్‌ : 3,138 పరుగులు (118)

అజింక్య రహానె: 3,098 పరుగులు (106)

షేన్‌ వాట్సన్‌ : 2,474 పరుగులు (84)

జోస్‌ బట్లర్‌ : 2,378 పరుగులు (60)

రాహుల్‌ ద్రవిడ్‌ : 1,324 పరుగులు (52)

Advertisement

Next Story