IPL 2023: ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు గల్లంతు.. సన్‌రైజర్స్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్..!

by Vinod kumar |
IPL 2023: ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు గల్లంతు.. సన్‌రైజర్స్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ఈ రోజు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్నద్ధమౌతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢీ కొట్టబోతున్నది. సన్‌రైజర్స్ కంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లల్లో అయిదింట్లో గెలిచి.. 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే సన్‌రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లల్లో 6 ఘోర పరాజయాన్ని చవి చూసింది. గెలిచింది కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే. సన్‌రైజర్స్ చివరి అయిదు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కటంటే ఒక్కటే. రాజస్థాన్‌తో పోల్చుకుంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన అవసరం హైదరాబాద్‌కే ఉంది. ప్లేఆఫ్స్ చేరడానికి ఇదే చివరి అవకాశంగా చెప్పవచ్చు. ఇందులో ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ఉండవు.

అలాంటి కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలా ఆడతారనేది ఆసక్తి రేపుతోంది. సన్‌రైజర్స్ బ్యాటర్స్‌లో.. హ్యారీ బ్రూక్ సెంచరీ తరువాత మెరుపులు మాయం అయ్యాయి. అతని నుంచి భారీ ఇన్నింగ్ రాలేదు. 10 పరుగులు కూడా చేయలేకపోతోన్నాడు. దీంతో హ్యారీ బ్రూక్‌కు బదులుగా న్యూజిలాండ్‌కు చెందిన డాషింగ్ వికెట్ కీపర్ గ్లెన్ ఫిలిప్స్‌ను ఆడించవచ్చనే అంచనాలు ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్/గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, మార్కో జెన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్‌.

రాజస్థాన్ రాయల్స్‌ తుదిజట్టు (అంచనా):

జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్/ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, 11 యుజ్వేంద్ర చాహల్.

Advertisement

Next Story