- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: ఐపీఎల్‌లో ‘ధోనీ రివ్యూ సిస్టమ్’.. సక్సెస్ రేట్ ఎంతో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రివ్యూ కోరాడంటే దాదాపు ఆయనకు అనుకూలంగానే కచ్చితంగా వస్తుందని క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు చెబుతారు. ప్రస్తుత ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ ధోనీ.. సీఎస్‌కేను విజయాల బాటలో నడిపిస్తున్నాడు. అంపైర్ వెలువరించే నిర్ణయానికి వ్యతిరేకంగా ధోనీ డీఆర్‌ఎస్ కోరాడంటే.. కచ్చితంగా ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దాదాపు ఖాయం. ధోనీ మరోసారి తన ‘డీఆర్‌ఎస్’ పవర్ ఏంటో చూపించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అంపైర్ ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా డీఆర్‌ఎస్ కోరాడు. అయితే దేశ్‌పాండే వేసిన బంతిని డేవిడ్ వీజ్ ఆడలేకపోవడంతో ప్యాడ్లను తాకగా.. ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. వెంటనే ధోనీ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. సమీక్షలో బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టంగా తేలింది.
దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఔట్‌గా ప్రకటించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత కచ్చితత్వంతో డీఆర్‌ఎస్‌ను వాడుకున్న కెప్టెన్‌గా ధోనీ ఘనత సాధించాడు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌లోనూ ధోనీ ‘డీఆర్‌ఎస్’ సక్సెస్ రేట్ 85.71 శాతంగా ఉంది. ఓవరాల్‌గా ధోనీ ఇప్పటి వరకు 217 ఐపీఎల్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా.. విజయాలపరంగా 59.15 శాతం సక్సెట్ రేట్ సాధించాడు. కనీసం వందకుపైగా మ్యాచుల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో ధోనీనే టాప్. ఆ తర్వాత రోహిత్ శర్మ (148 మ్యాచ్‌లు) 56.08 శాతం, గౌతమ్ గంభీర్ (129 మ్యాచ్‌లు) 55.42 శాతం, విరాట్ కోహ్లీ (142 మ్యాచ్‌లు) 49.91 శాతంతో ఉన్నారు.