రాజస్థాన్ ఎలిమినేట్.. ఆరో స్థానంతో సరి

by Javid Pasha |
రాజస్థాన్ ఎలిమినేట్.. ఆరో స్థానంతో సరి
X

జైపూర్ : ఐపీఎల్-16లో రాజస్థాన్ రాయల్స్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై గెలవడంతో రాజస్థాన్ నిష్ర్కమణ ఖరారైంది. లీగ్ దశలో శాంసన్ సేన 14 మ్యాచ్‌ల్లో ఏడింట విజయాలతో 14 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. నాలుగో బెర్త్ కోసం రాజస్థాన్ సైతం పోటీపడినప్పటికీ.. తమ చివరి మ్యాచ్‌ల్లో ముంబై, బెంగళూరు ఓడిపోతేనే ఆ జట్టు నాకౌట్ పోటీలో ఉండేది. కానీ, హైదరాబాద్‌పై ముంబై గెలవడంతో రాజస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి.

బలమైన బ్యాటింగ్ దళం కలిగిన రాజస్థాన్ ఆరంభంలో వరుస విజయాలతో దూకుడు కనబర్చింది. ఆ తర్వాత వరుస పరాజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుని చివరికి ఆరో స్థానంతో లీగ్‌ను ముగించింది. గత సీజన్‌లో రాజస్థాన్ ఫైనల్‌కు దూసుకెళ్లినప్పటికీ తుది పోరులో గుజరాత్ చేతిలో ఓడి టైటిల్‌ను అందుకోలేకపోయింది.

Advertisement

Next Story