- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టాలు, త్యాగాలు వంటి పదాలు వాడను : విరాట్ కోహ్లీ
దిశ, స్పోర్ట్స్ : తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని చెప్పుకోనని టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో విరాట్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘నిజాయతీగా చెబుతున్నా. నేను ఎలాంటి కష్టాలు పడలేదు. ఎలాంటి త్యాగం చేయలేదు. నాకు నచ్చింది చేస్తున్నా. ఒక్క రోజులో రెండు పూటల భోజనం పొందని వాడు కష్టపడుతున్నట్టు. నేను ఎప్పటి నుంచే ఇష్టపడిన పనినే చేస్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్నా. నేను క్రికెట్ ఆడతాను. అది నా వృత్తి. జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచిస్తే నేను పడ్డ కష్టాలు కష్టాలే కావు.’ అని కోహ్లీ తెలిపాడు. కాగా, ఐపీఎల్-17లో బెంగళూరు తరపున విరాట్ అదరగొడుతున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసిన అతను ప్రస్తుతం టాప్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు.
Just @imVkohli spilling facts 🔥 straight from the heart ❤ #AsianPaints #NeoBharat #ColoursOfProgress #ViratKohli #BrandAmabassdor pic.twitter.com/Ol7KeSoW3c
— Asian Paints (@asianpaints) April 20, 2024
- Tags
- #Virat Kohli