- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 163
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజారాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టైటాన్స్ 20 ఓవర్లు ఆడి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. 67 పరుగులకే 4 వికెట్ల్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ డీసీనీ సర్ఫరాజు ఖాన్ (30), అక్సర్ పటేల్ (36), పొరెల్ (20) గట్టెక్కించారు. ఇక అంతకు ముందు ఓపెనర్లలో పృథ్విషా 7 పరుగులు మాత్రమే చేసి జట్టు స్కోర్ 29 వద్ద అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మార్ష్ 4 పరుగులు మాత్రం చేసి షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇక 37 పరుగులు చేసి కుదురుకున్నాడు అనుకున్న సమయలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ జోసెఫ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక అనంతరం వచ్చిన రూసో జట్టు స్కోర్ 67 వద్ద జోసెఫ్ బౌలింగ్ లో డకౌట్ అయి వెనుదిరిగాడు. ఇక గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీయగా.. జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే 163 పరుగులు చేయాల్సి ఉంటుంది.