- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నై జట్టుకు షాక్.. ఐపీఎల్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఐపీఎల్‌లో ప్లేయర్లను గాయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభం అయి సగం మ్యాచులు ముగియకముందే గాయాల కారణంగా చాలామంది ప్లేయర్లు బెంచ్ కు పరిమితం అవుతున్నారు. ఇందులో కొంతమంది కొన్ని మ్యాచులకు దూరం కాగా మరికొందరు ఈ సీజన్ మొత్తానికి దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే గాయం కారణంగా చెన్నై స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 నుండి తప్పుకున్నాడు. దీంతో ఆ జట్టుకు తదుపరి మ్యాచులు అత్యంత కీలకమైనవి ఉండటంతో చెన్నైకి షాక్ తగిలింది. గత రెండు IPL సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ప్రాతినిధ్యం వహించిన కాన్వే 23 మ్యాచ్‌లు ఆడి 924 పరుగులు చేశాడు, ఇందులో 9 అర్థ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 92* పరుగులు ఉన్నాయి. కాన్వే స్థానంలో CSK రిచర్డ్ గ్లీసన్‌ను చేర్చుకుంది.
Advertisement
Next Story