Big Alert: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్..!

by Ramesh N |
Big Alert: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ సీజన్‌లో సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోని క్రికెట్ అభిమానులకు వల వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు ఎ.జగన్ మోహన్ రావు ఇవాళ ఒక ప్రకటన చేశారు. ఈనెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగనున్న చెన్నై వర్సెస్ హైదరాబాద్ నకిలీ మ్యాచ్ టిక్కెట్లను కొందరు సోషల్ మీడియాలో విక్రయిస్తున్నట్టు వస్తున్న వదంతులు పట్ల క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండండాలని సూచించారు.

అసత్య ప్రచారాలను చూసి మోసపోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా అనాధికారికంగా టిక్కెట్లు విక్రయిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి.. అని హెచ్‌సీఏ అధ్యక్షుడు వెల్లడించారు.

Advertisement

Next Story