- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ చేయాల్సిందదే : ఆర్పీ సింగ్
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో ఆర్పీ సింగ్ టీమ్ కాంబినేషన్ గురించి మాట్లాడాడు. ‘విరాట్ ఓపెనర్‌గా రావడం వల్ల టీమ్ కాంబినేషన్ కూడా బాగుంటుందని చెప్పాడు. ‘రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని కోరుకుంటున్నా. సంజూ శాంసన్ నం.3లో బ్యాటింగ్‌కు రావాలి. 4వ స్థానంలో సూర్యకుమార్, 5వ స్థానంలో పంత్, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడొచ్చు. ఇది టీమ్ కాంబినేషన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, మాకు ఇలాంటి లైనప్ కావాలి.’ అని చెప్పాడు. జట్టు సమతూకంగా ఉండటంలో పాండ్యా ప్రదర్శన కీలకం కానుందని, అతను వీలైనంత త్వరగా ఫామ్ అందుకోవాలన్నాడు.
కాగా, ఇటీవల ఐపీఎల్-17లో బెంగళూరు తరపున కోహ్లీ ఓపెనర్‌గా అదరగొట్టిన విషయం తెలిసిందే. 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. దీంతో పొట్టి ప్రపంచకప్‌లో విరాట్ ఓపెనింగ్ చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది. గతంలో రోహిత్, కోహ్లీ ఒక్కసారి మాత్రమే ఓపెనర్లుగా వచ్చారు. 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.