- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షర్ స్టన్నింగ్ క్యాచ్.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ కూడా అతనికే
దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసినందుకు అక్షర్ పటేల్ ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ గెలుచుకున్నాడు. మెడల్ కోసం అక్షర్‌తోపాటు సూర్యకుమార్, కుల్దీప్ యాదవ్ పోటీపడ్డారు. అయితే, మెడల్ అక్షర్ గెలిచినట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ సేనెవిరత్నె అక్షర్‌కు మెడల్ అందజేశాడు. డ్రెస్సింగ్ రూం వీడియోను బీసీసీఐ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
కాగా, ఆ మ్యాచ్‌లో అక్షర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. స్పిన్నర్ కుల్దీప్ వేసిన 9వ ఓవర్‌లో మార్ష్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ వద్ద అక్షర్ గాల్లోకి ఎగిరి మరి బంతిని పట్టుకున్నాడు. అప్పటి వరకు హెడ్, మార్ష్ కలిసి ఆసిస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. అక్షర్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆ జోడీ విడిపోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆసిస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.