IND vs ENG: టీ20 సెమీఫైన్‌లకు భారీ వర్ష సూచన..నేరుగా ఫైనల్‌లోకి భారత్

by Mahesh |
IND vs ENG: టీ20 సెమీఫైన్‌లకు భారీ వర్ష సూచన..నేరుగా ఫైనల్‌లోకి భారత్
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టు అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళిన భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. దీంతో రోహిత్, విరాట్ లు ఈ టీ20 వరల్డ్ కప్ అయిన సాధించాలనే తపనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ సెమీ ఫైనల్ వరకు చేరింది. టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్ జూన్ 27 రాత్రి 8 గంటలకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. కాగా ఈ మ్యాచులో విజయం సాధిస్తే నేరుగా భారత్ ఫైనల్ చేరుతుంది.

ఇదిలా ఉంటే రేపు మ్యాచ్ జరగాల్సిన గయానా నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ రోజు కూడా భారీ వర్షం కురవడంతో ప్లేయర్లు ప్రాక్టీస్ చేయడం మానేశారు. అలాగే 27న కూడా మ్యాచ్ జరిగే సమయంలో దాదాపు 80 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో జూన్ 27న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ కోసం మొత్తం 7 గంటల 20 నిమిషాల సమయం కేటాయించింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఎమ్ జరుగుతుందనే ప్రశ్న ప్రస్తుతం భారత ప్రేక్షకుల్లో తలెత్తింది. కాగా దీనిపై కూడా ఐసీసీ స్పష్టమైన ప్రకటన చేసింది. సెమీస్ కోసం కేటాయించిన 7 గంటల 20 నిమిషాలకు కూడా మ్యాచ్ ప్రారంభం కాకపోయిన, పూర్తి కాకపోయినా మ్యాచ్ రద్దు చేస్తారు. దీంతో నెట్ రన్ రేట్ కారణంగా భారత్ నేరుగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరుతుందని ఐసీసీ ప్రకటిచింది.

Advertisement

Next Story

Most Viewed