ఆస్ట్రేలియా ఆశలు ఆవిరి చేసి.. వరల్డ్ కప్ నుంచి బయటకు పంపిన ఆఫ్ఘనిస్తాన్

by Mahesh |
ఆస్ట్రేలియా ఆశలు ఆవిరి చేసి.. వరల్డ్ కప్ నుంచి బయటకు పంపిన ఆఫ్ఘనిస్తాన్
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2024 లో ఆస్ట్రేలియా జట్టు ఊహించని షాక్ తగిలింది. సూపర్ 8 మ్యాచుల్లో ఆ జట్టును రెండు సార్లు మట్టి కరిపించింది. ఓ సారి డైరెక్టుగా ఓడించిన ఆఫ్ఘన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ జట్టుపై అతి తక్కువ స్కోరును ఢిఫెండ్ చేసుకుని ఆస్ట్రేలియా హోప్స్‌ను లాగేసుకుంది. మొదటి నుంచి గెలుపే లక్ష్యంగా ఆడిన ఆఫ్ఘాన్ జట్టుకు పలుమార్లు వర్షం సహాయం చేసిందనే చెప్పాలి. ఉదయం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాగా దాదాపు 10.30 గంటల వరకు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కనీసం బంగ్లాదేశ్ జట్టు గెలిచిన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ చేరే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. ఆస్ఘనిస్తాన్ బౌలర్ల పట్టుదల.. సరైన సమయంలో కెప్టెన్ నిర్ణయాలతో ఎట్టకేలకు విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీ20 చరిత్రలో మొదటిసారి సెమీస్ చేరుకుంది. దీంతో ఆస్ట్రేలియా టీ20 నుంచి ఎలిమినేట్ అయింది. కాగా నెల 27న ఉదయం ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆఫ్ఘాన్ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరుతుంది. కానీ ఈ సీజన్ సౌతాఫ్రికా జట్టు ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీస్ వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed