సెమీస్ నుంచి ఆస్ట్రేలియా అవుట్.. రిలాక్స్‌మోడ్‌లో మూడు దేశాలు

by Mahesh |
సెమీస్ నుంచి ఆస్ట్రేలియా అవుట్.. రిలాక్స్‌మోడ్‌లో మూడు దేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా మంగళవారం సూపర్ 8లో చిట్టచివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ కొనసాగిన ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు ఆప్ఘాన్ విజయం సాధించి సెమీస్ చేరుకుంది. దింతో బంగ్లాదేశ్ విజయం ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా జట్టు 20 వరల్డ్ కప్ సెమీస్ చేరకుండానే ఎలిమినేట్ అయింది. దీంతో మూడు జట్లు ఊపిరి పీల్చుకున్నాయి. గతంలో ఆస్ట్రేలియా జట్టు వల్ల కీలక మ్యాచుల్లో నష్టపోయిన భారత్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు ప్రస్తుతం సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరిందంటే చాలు ఎలాగైన మ్యాచులు గెలిచి టైటిల్ ను ఎగరేసుకొని పొతుంది. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందుకు గత రెండు ప్రపంచ కప్ లు, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఉదహారణ గా చెప్పుకోవచ్చు. దీంతో నేటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ నుంచి అవుట్ కావడంతో ఆ జట్టుతో సెమీస్, ఫైనల్‌లో తలపడే బాద తగ్గిందని బావిస్తున్నాయి. సెమీస్ కు క్వాలిఫై అయిన నాలుగు జట్టు ఈ నెల 27 ఉదయం, సాయంత్రం మ్యాచుల్లో తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed