dead body found : వైరా నదిలో గల్లంతైన యువకుడు మృతి

by Sridhar Babu |
dead body found : వైరా నదిలో  గల్లంతైన  యువకుడు మృతి
X

దిశ, మధిర : వైరా నదిలో సోమవారం గల్లంతైన యువకుడు అద్దంకి రవీంద్ర మృతదేహాన్ని మంగళవారం గుర్తించారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని బంజారా కాలనీకి చెందిన అద్దంకి రవీంద్ర ( 18 ) అనే యువకుడు సోమవారం మధిర రైల్వే బ్రిడ్జి సమీపంలో వైరా నదిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా కాలనీకి చెందిన అద్దంకి రవీంద్ర తన మిత్రుడు

నరసింహతో కలిసి వైరా నదిలో చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో రవీంద్ర ప్రమాదవశాత్తు నదిలో పడి నీట మునగటంతో ఈ విషయాన్ని నరసింహ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు స్థానికులతో కలిసి నది వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో రిస్కీ టీం సిబ్బంది గాలించారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. మంగళవారం ఉదయం మరలా గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు రవీంద్ర మృతదేహాన్ని గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed