- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగ్గురు యువకులకు ఏడాది జైలు శిక్ష
దిశ, అశ్వరావుపేట టౌన్ : అతివేగంగా ద్విచక్ర వాహనం నడిపి ఎస్సైని ఢీకొన్న ముగ్గురు యువకులకు కొత్తగూడెం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పాములవారిగూడెం గ్రామానికి చెందిన గుజ్జు భాను కిరణ్, సభలం దిలీప్ కుమార్, పోలవరం మండలం కంకాలగూడెం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ లు ఒకే ద్విచక్ర వాహనంపై 2021 ఫిబ్రవరి 14న వినాయకాపురం నుండి అశ్వరావుపేట వస్తున్నారు.
ఉట్లపల్లి సమీపంలో అప్పటి ఎస్సై మధు ప్రసాద్ వాహనాలు తనిఖీ చేస్తుండగా యువకులు ద్విచక్ర వాహనం ఆపకుండా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఎస్సై కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ కేసులో పూర్వపరాలు పరిశీలించిన కొత్తగూడెం న్యాయమూర్తి భానుమతి యువకులకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పును విలువరించినట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.
- Tags
- one year jail