- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉరి వేసుకొని వ్యాపారి మృతి

దిశ, వరంగల్ టౌన్ : ఉరి వేసుకొని అడ్తి వ్యాపారి మృతి చెందిన సంఘటన బుధవారం కాశీబుగ్గలో చోటుచేసుకుంది. ఇంతేజార్ గంజ్ సీఐ మచ్చ శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏనుమాముల మార్కెట్ లో లక్ష్మీ ట్రేడర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్న రాజేందర్ (50) మంగళవారం రాత్రి కాశిబుగ్గ సొసైటీ కాలనీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే మృతుడు రాజేందర్ కు భార్య కల్పనతో గొడవ జరిగింది. వారు ఇరువురు వేరు వేరుగా ఉంటున్నారు. రాజేందర్ తన తండ్రి రాజయ్య, చెల్లెలు శోభారాణితో కలిసి ఉండగా, కల్పన తమ పిల్లలతో ఉంటుంది. దీంతో మనస్థాపానికి గురైన రాజేందర్ జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కి నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లెలు శోభారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శివకుమార్ తెలిపారు.
- Tags
- hanging