ఏసీబీ వలలో ఎస్ఐ, కానిస్టేబుల్

by Disha Web Desk 15 |
ఏసీబీ వలలో ఎస్ఐ, కానిస్టేబుల్
X

దిశ, భద్రాచలం : భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్ ను వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, సీఐలు శ్యాంసుందర్, మహేష్ గురువారం అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఎస్ఐ కి, కానిస్టేబుల్ కి మధ్యవర్తిగా పనిచేస్తూ, పలువురి వద్ద లంచాలు డిమాండ్ చేస్తున్న సీసీటీవీ టెక్నీషియన్ నవీన్ అనే ప్రైవేటు వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేటు గోడౌన్ నుంచి నాలుగు బస్తాల పంచదారను రాత్రి సమయంలో ఇరువురు వ్యక్తులు ఆటోలో దొంగతనంగా తరలించడం సీసీ టీవీ కెమెరాలలో చూసిన కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు వ్యక్తి నవీన్ ఎస్సై శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు.

ఆటోతో పాటు ఇద్దరు వ్యక్తులను స్టేషన్​కు తీసుకురావాల్సిందిగా ఎస్సై ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శంకర్, ప్రైవేటు వ్యక్తి నవీన్​ ఆటోతో పాటు ఆ ఇద్దరు వ్యక్తులను పోలీస్ స్టేషన్​కు తీసుకుని వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయకుండా కానిస్టేబుల్ శంకర్, సీసీటీవీ టెక్నీషియన్ నవీన్ వారితో బేరసారాలకు దిగారు. కేసు నమోదు చేయకుండా, ఆటోతో పాటు నాల్గు బస్తాల షుగర్, సెల్ ఫోన్ లను రిలీజ్ చేయాలంటే రూ. 30 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అయితే అంత డబ్బులు ఇచ్చుకోలేమని బతిమిలాడినా వినకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఖమ్మం ఏసీబీ అధికారులకు సమయం

లేకపోవడంతో ఈ కేసును వరంగల్ ఏసీబీ అధికారులకు అప్ప చెప్పారు. గురువారం వరంగల్ నుండి వచ్చిన ఏసీబీ అధికారులు డీఎస్పీ సాంబయ్య, సీఐలు శ్యాంసుందర్, మహేష్ ఫిర్యాదు చేసిన సాయి తేజకు రూ. 20 వేలు ఇచ్చి పోలీస్ స్టేషన్​కు పంపారు. ఎస్ఐ ఆదేశాల మేరకు సీసీటీవీ రూమ్ లో కానిస్టేబుల్ శంకర్ రూ. 20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై శ్రీనివాసును, మధ్యవర్తిత్వం నడిపినందుకు సీసీ కెమెరా టెక్నీషియన్ నవీన్ అనే ప్రైవేటు వ్యక్తిని, కానిస్టేబుల్​ శంకర్ ని అరెస్టు చేసి ఖమ్మం ఏసీబీ అధికారులకు అప్పజెప్పనున్నట్లు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

Next Story

Most Viewed