అక్రమ సంబంధం అనే అనుమానంతో హత్య..

by Aamani |
అక్రమ సంబంధం అనే అనుమానంతో హత్య..
X

దిశ,భీంగల్ : ఇద్దరు స్నేహితుల మధ్య అక్రమ సంబంధం అనే అనుమానం హత్యకు దారితీసిన సంఘటన నూతన సంవత్సరం రోజున మోర్తాడ్ మండల కేంద్రంలోని విషాదాన్ని నింపింది.భీంగల్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వెనుక ఉన్న కాలనీలో నివాసం ఉంటున్న ఇద్దరు స్నేహితులు చెప్పాల రాకేష్, తెడ్డు సూర్యల మధ్య అక్రమ సంబంధం అనుమానం నిండు ప్రాణాన్ని బలిగొంది. తెడ్డు సూర్య తన భార్యతో చెప్పాల రాకేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోపం తో నూతన సంవత్సరం రోజు రాకేష్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు.

రాకేష్ పై తనకున్న కోపం తో కత్తితో ఛాతిలో, కడుపులో దారుణంగా పొడిచి చంపి పరారయ్యాడు .తన ఒకానొక కొడుకును దారుణంగా హత్య చేసాడన్నా కోపం తో నిందితుడు సూర్య ఇంటికి హతుడి బంధువులు నిప్పంటించారు. సంఘటన స్థలంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించి, పీకేటింగ్ విధించారు. హతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.పోలీసులు శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపినట్లు సీ.ఐ వివరించారు.సీఐ వెంట మోర్తాడ్ ఎస్సై అనిల్ రెడ్డి,కమ్మర్ పల్లి ఎస్సై రాజ శేఖర్,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story