- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి.. తండ్రికి సీరియస్
by GSrikanth |

X
దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతిచెందారు. తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం జరిగింది. కాగజ్ నగర్ మండలం భట్టుపల్లికి చెందిన తండ్రి, కొడుకు, తల్లి ముగ్గురు పని నిమిత్తం అసిఫాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. వచ్చిన పని ముగించుకొని తిరిగి వెళుతుండగా ఆసిఫాబాద్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద లారీ బైక్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తల్లి షేక్ భాను, కొడుకు షేక్ అసిఫ్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ ఘటనా స్థలానికి వచ్చి మృతుల వివరాలను కనుక్కున్నారు. ప్రమాదంలో గాయపడిన తండ్రికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
Next Story